Officers | మండలంలో డిప్యూటీ సీఎం పర్యటన

Officers | మండలంలో డిప్యూటీ సీఎం పర్యటన

Officers | జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు పర్యటిస్తున్నట్లు జై నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ రావు, తాసిల్దార ఆడ బీర్షావ్ ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

జైనూర్, మండలంలో జంగాం ఊషగం, భూషిమెట్ట క్యాంపు గ్రామాల్లో పర్యటించి జంగం లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతారని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఉప ముఖ్యమంత్రి ఏజెన్సీ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించగా పాదయాత్రలో ఇచ్చిన హామీలఫై ప్రజలతో చర్చిస్తారని ఊషగం జనగం పూజ కులవృత్తుల వారితో మాట్లాడతారని అధికారులు తెలిపారు.

ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్, అధికారులు…

జై నూరు మండలంలో గురువారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటన విజయవంతం చేసేందుకు జనగాంలో నిర్వహించే సమావేశ స్థలాన్ని పర్యటన ఏర్పాట్లను రెవెన్యూ విభాగం అడిషనల్ కలెక్టర్ డేవిడ్, డ్వామ ప్రాజెక్ట్ అధికారి భానోత్ దత్తరం, అసిఫాబాద్ ఆర్డిఓ లోకేష్ కుమార్, సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు ఏర్పాట్లను విజయవంతం చేయాలని తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సలహా సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలోజైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథరావు, ఆత్మ చైర్మన్ రాథోడ్ రమేష్,ఎంపీడీవో సుధాకర్ రెడ్డి,తాసిల్దార్ బీర్షావ్, సిఐ రమేష్ జంగాం ఉపసర్పంచ్ సజ్జత్, మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు ఆత్రం జాలింషా, భూపతి, వార్డు సభ్యులు భగవంతరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply