TG | మెడికల్ షాపులను తనిఖీ….

TG | మెడికల్ షాపులను తనిఖీ….
TG | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో పలు మెడికల్ షాపులను ఈ రోజు డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు ఔషధాల నిల్వలు పలు విషయాలపై తనిఖీ చేశారు. మండల కేంద్రంలో 8 మెడికల్ దుకాణాలను తనిఖీ చేశామన్నారు. మొత్తం దుకాణాలలో రికార్డులు సరిపోయాయని ఎక్స్పర్ అయిన ఔషధాలు, నిషేధిత మందులు లభించలేదన్నారు. మెడికల్ షాప్ నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను పాటించాలని, షెడ్యూల్ హెచ్ మందులు యాంటీబయాటిక్ వంటి మందులను డాక్టర్ రిసిప్షన్ లేకుండా ఇవ్వకూడదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అట్టివారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి మెడికల్ షాపును సీజ్ చేయడం జరుగుతుందని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చంద్రకళ హెచ్చరించారు.
