Temple Trust | ఘనంగా శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి వేడుకలు

Temple Trust | ఘనంగా శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి వేడుకలు
Temple Trust | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ లోని పద్మశాలి కుల దైవం శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి జయంతి ఉత్సవాలు స్థానిక మార్కండేయ దేవాలయంలో ఆ రోజు పద్మశాలి పురోహితులు మహేశ్వరం నాగరాజు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో శివ భక్త మార్కండేయ ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు పద్మశాలి కుల సంఘ నాయకులు, స్థానిక ఎస్సై కే సతీష్ పూజలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశి కంటి లక్ష్మీనరసయ్య, జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గంగుల రాములు, మార్కెట్ డైరెక్టర్ పోచం జగన్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పోచం సోమయ్య, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోచం కన్నయ్య, మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు మహేశ్వర వెంకటేశ్వర్లు, మండల కార్య నిర్వాహ అధ్యక్షులు నల్ల యాదగిరి, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆర్గనైజర్ గుండు ప్రసాద్, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పోచం బిక్షపతి, ప్రధాన కార్యదర్శి జిల్లా రవీందర్, మండల చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు వంగరి రాములు, కూరపాటి రాములు, పసునూరి యాదగిరి, ఏలే ఉప్పలయ్య, వేముల నారాయణ, పోచం కనక సేన, బిరుదు శ్రీనివాస్, చిలక రాములు, యాదగిరి, హనుమంతు, జల్ది సత్యనారాయణ, గుడెల్లి రామ నరసయ్య తదితర పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు.
