Arrive and Live | డ్రంక్ అండ్ డ్రైవ్ – అరైవ్ అండ్ లైవ్ నినాదంతో అవగాహన ర్యాలీ

Arrive and Live | డ్రంక్ అండ్ డ్రైవ్ – అరైవ్ అండ్ లైవ్ నినాదంతో అవగాహన ర్యాలీ

Arrive and Live | నాగర్‌కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రభ : నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌(Headquarters)లో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు – 2026 కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా “డ్రంక్ అండ్ డ్రైవ్ – అరైవ్ అండ్ లైవ్( Arrive and Live)” అనే నినాదంతో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీని నిర్వహించారు.

ఈ ర్యాలీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి , జిల్లా కలెక్టర్ lబడావత్ సంతోష్ గారు, జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ పాటిల్, అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా రవాణా అధికారి (డీటీఓ) బాలు,డీఎస్పీ శ్రీనివాస్ ,డీఎంహెచ్ఓ రవి నాయక్ పాల్గొన్నారు.

Arrive and Live |

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రహదారి ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు రహదారి భద్రతపై అవగాహన పెంపొందించుకొని సమాజంలో మార్పుకు దోహదపడాలని కోరారు.

Arrive and Live |

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా చేపడుతున్న ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Arrive and Live |
Arrive and Live |

CLICK HERE TO READ MORE : Kavitha | పురపాలిక ఎన్నికల్లో జాగృతి పోటీ చేయడం లేదు

CLICK HERE TO READ MORE :

Leave a Reply