Disabled | కబ్జా చేయాలనుకోవడం దుర్మార్గం

Disabled | కబ్జా చేయాలనుకోవడం దుర్మార్గం

  • భూ కబ్జాదారులపై సీఎం చంద్రబాబుకు పిర్యాదు.
  • మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి.

Disabled | నందికొట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఇంటి స్థలాలు ఇచ్చిందని, ఆ స్థలాలు కబ్జా చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని వికలాంగులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ సమస్య తీసుకొని వెలుతానని, వికలాంగులకు న్యాయం జరిగేందుకు తాను అండగా ఉంటానని, భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రభుత్వంకు చెడ్డపేరు వస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.

ఈ రోజు నంద్యాల జిల్లా నందికొట్కూరులోని బైరెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బైరెడ్డి మాట్లాడుతూ… 2004 వ సంవత్సరంలో నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రోడ్డులో సర్వే నెంబర్ 229A, 229V లో 12 ఎకరాల 5 సెంట్ల స్థలాన్ని తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో నేను వికలాంగులకు ఇంటి స్థలాలకు కేటాయించడం జరిగిందనీ, 450 ప్లాట్లను పంపిణీ చేశామన్నారు.

Disabled |

నా హయం తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చిన వికలాంగులను ఎవ్వరూ కదిలించలేదన్నారు. దివ్యాంగులకు హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న మేము వీరు భవిష్యత్తు బాగు పడితే ఒక 4000 మందికి నివాసం ఏర్పాటు చేసిన వారమౌతమని అనుకున్నాం అన్నారు. నందికొట్కూరు నియోజకర్గమే కాకుండా నంద్యాల జిల్లాలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇలా వికలాంగులకు ఒకకాలనీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాను కోరుతున్నానన్నారు.

Disabled |

Leave a Reply