కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఊర్కొండపేట శ్రీ పబ్బాతి ఆంజనేయస్వామి దేవాలయ సన్నిధిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతరాములోరి కళ్యాణం కన్నుల పండుగ కొనసాగింది. రాములోరి కళ్యాణం ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ, ప్రవీణ్ ల మంత్రోత్సవాల మధ్యన అశేష ప్రజానీకం మధ్యన రాములోరీ కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది.

ఈ కళ్యాణ మహోత్సవా ఘటానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు భక్తులు పాల్గొని స్వామి వారి కళ్యాణ అనంతరం స్వామివారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉరుకొండ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు జర్పుల రమేష్ నాయక్, ఉరుకొండ సర్పంచ్ మంజుల శ్రీనివాసులు, నాయకులు మనోహర్ రెడ్డి, రవీందర్ గౌడ్, శ్రీశైలం, మ్యకల శ్రీనివాసులు, అబ్దుల్ సమి, వహీదుద్దీన్, దేవాలయ అధికారులు మారుతి రావు, వరలక్ష్మి, సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply