Admission | యువ చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక చేయుత

Admission | యువ చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక చేయుత
Admission | వికారాబాద్, ఆంధ్రప్రభ: బంటారం మండలానికి చెందిన కోలెలి సాయి కృష్ణ అనే యువకుడికి Ayan కాలేజీలో బీఎస్సీ ఎంఎల్టీ (B.Sc MLT) కోర్సులో అడ్మిషన్ పొందే అవకాశం లభించింది. అయితే ఆర్థికంగా ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న సాయి కృష్ణకు, యువ చైతన్యం ట్రస్ట్ తరపున రూ.15,000 (పదిహేనువేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సహాయ కార్యక్రమంలో యువ చైతన్యం ట్రస్ట్ చైర్మన్ చైతన్య కిరణ్ (వికారాబాద్) సాయి కృష్ణకు 15000 రూపాయలు అందజేసి ప్రోత్సహించారు. విద్య ద్వారా యువత ముందుకు సాగాలని, అవసరంలో ఉన్న వారికి ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
