Jana Nayagan | విడుదలపై తీర్పు రిజర్వ్‌

Jana Nayagan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విజయ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జన నాయగన్‌’ విడుదల మరింత ఆలస్యం కానుంది. ఆ సినిమా విడుదలపై కొనసాగుతున్న వివాదంలో మద్రాసు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా విడుదలకు సంబంధించిన సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఎఫ్‌సీ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు సుదీర్ఘంగా విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. దీంతో జన నాయగన్‌ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply