MLA | కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన

MLA | కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన

MLA | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఆధ్వర్యంలో అభివృద్ధి పనులలో భాగంగా ప్రభుత్వ భూమిలో కళ్యాణ మండపం నిర్మాణానికి ఈ రోజు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు.

కళ్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే స్వయంగా రూ. 10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలయ కమిటీ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ కు సూచించారు. మండపం నిర్మాణానికి పూనుకున్న ఆంజనేయులు ను ఎమ్మెల్యే అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, జడల చిన్న మల్లయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు గంజి వెంకటేశం, బుద్ధ విమల కృష్ణమూర్తి, రుద్రారం లింగస్వామి వరకాంతం నరసింహారెడ్డి జిట్ట సాయిలు వనమా నిఖిల్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply