Kadem | క్రీడలతో మానసిక ఉల్లాసం

Kadem | క్రీడలతో మానసిక ఉల్లాసం
- ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషణ్
Kadem | కడెం, ఆంధ్రప్రభ : క్రీడలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని, క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుందని ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగల భూషణ్ అన్నారు. కడెం మండలంలోని పెద్ద బెల్లాల్ జీపీ పరిధిలో గల మొర్రిగూడెం గ్రామంలో జరిగిన క్రికెట్ పోటీలు ఇవాళ ముగిశాయి.
రైసింగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రికెట్ పోటీల్లో మొత్తం 9 టీమ్ లు పాల్గొనగా, ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మొదటి స్థానాన్ని రైసింగ్ స్టార్స్ టీమ్ నిలువగా, రెండవ స్థానాన్ని లాగాన్ టీమ్ కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఖానాపూర్ ఏఎంసీ ఛైర్మెన్ పడిగెల భూషణ్ బెల్లాల్ పెద్ద బెల్లాల్ గ్రామాల సర్పంచ్ లు ఈదుల తిరుపతి బొంతల లక్ష్మీ భూమన్న యాదవ్, పెద్ద బెల్లాల్ ఉపసర్పంచ్ రమ్య రవీందర్ లు మొదటి విజేతకు షీల్డుతో పాటు, రూ.5 వేలు, రెండవ బహుమతిగా షీల్డుతో పాటు రూ.2500ను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… యువకులు క్రీడా స్పూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రైజింగ్ స్టార్ టోర్నమెంట్ క్రీడాకారులు అవినాష్, దినేష్, వంశీ, విగ్నేష్, పవన్, వంశీ, గణేష్, రాజు, తదితరులున్నారు.
