Basara Temple | బాసరలో అధికారుల బృందం పర్యటన

సరస్వతి ఆలయం అభివృద్ధిపై సమీక్ష

Basara Temple | బాసర, ఆంధ్రప్రభ : బాసర అమ్మవారి ఆలయాన్ని శనివారం అధికారుల బృందం పరిశీలించింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఈఎన్సి వసంత నాయక్, ఆలయ ఈఓ అంజనీదేవి, స్థాపతి మోతిలాల్, ఆర్కిటెక్ మాధవి లత ఇతర ఇంజనీరింగ్ అధికారులు ఆలయంలో చేపట్టే అభివృద్ధి పనుల స్థలాలను పరిశీలించారు. ముందుగా చేపట్టి ఆలయ గర్భాలయ పరిసరాలను పరిశీలించరు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తులను పెట్టే బాలాలయాన్ని సందర్శించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టి క్యూ లైన్ అక్షరాభ్యాస మండపం తదితర పనులను పరిశీలించారు. వీరి వెంట ఆలయ సిబ్బంది అధికారులు ఉన్నారు.

ఆలయంలో అధికారులక పూజలు…

బాసర అమ్మవారిని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ఈఎన్సి వసంత నాయక్, స్థాపతి మోతిలాల్, ఆర్కిటెక్ మాధవి లత అమ్మ వాణి దర్శించుకుని పూజలు చేశారు. వీరికి ఆలయ అధికారులు సాధర స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో వీరిచే ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరిపించి హరతి నిచ్చి ఆశీర్వదించారు.