Road Accident | ఉపాధ్యాయుడి మృతి..

Road Accident | ఉపాధ్యాయుడి మృతి..

Road Accident, జూపాడు బంగ్లా, ఆంధ్రప్రభ : జూపాడు బంగ్లా మండలంలోని తాటిపాడు పంచ వద్ద బుధవారం బస్సులో నుండి కిందపడి ఉపాధ్యాయుడు మృతి చెందాడు. జూపాడు బంగ్లా గ్రామానికి చెందిన నాగన్న(50) నంద్యాలలో నివాసం ఉంటూ సంత జుటూరు గ్రామంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు రావడంతో ఉపాధ్యాయుడు నాగన్న అతని భార్యతో కలిసి జూపాడుబంగ్లా గ్రామానికి ఆర్టీసీ బస్సులో వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

ఆత్మకూరు నుండి జూపాడు బంగ్లాకు ఆర్టీసీ బస్సులో వస్తుండగా తాటిపాడు గ్రామ సమీపంలో బస్సుకు గొర్రెలు అడ్డం రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేసాడు. బస్సుల్లో నుండి నాగన్న అనే ఉపాధ్యాయుడు ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త కళ్ల ముందే చనిపోవడంతో నాగన్న భార్య గుండెలు పగిలేలా బోరున విలపించారు. జూపాడుబంగ్లా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు.

Leave a Reply