Khammam | పండగ కోసం వస్తే.. దాడులు చేస్తారా..?

Khammam | పండగ కోసం వస్తే.. దాడులు చేస్తారా..?

  • ఇదెక్కడి సాంప్రదాయాలు..
  • చట్టంపై మాకు ఎంతో నమ్మకం ఉంది.
  • విచారించి మాపై దాడి చేసిన వారిపై..
  • చట్టపరమైన చర్యలు తీసుకోవాలి – దుండేటి జితేందర్ రెడ్డి.

Khammam, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి పాత కక్షల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సొసైటీ డైరెక్టర్ దుండేటి వెంకట కృష్ణారెడ్డి ఇంటి పై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాపా సుధాకర్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య పెద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ముకుమ్ముడిగా 20 మంది ఒకేసారి ఇంటి పై దాడి చేయడంతో మాజీ సొసైటీ డైరెక్టర్ దుండేటి వెంకట కృష్ణారెడ్డి, జితేందర్ రెడ్డి, చందన అనే మహిళకి గాయాలయ్యాయి. దాడికిలో ప్రత్యర్థి వర్గీయులు కాపా సాయివర్ధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాపా సుధాకర్ తో పాటు మరో ఐదు మంది వ్యక్తుల పై తల్లాడ పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో కాపా వర్గయులకు దుండేటి వర్గీయులకు రెండు వర్గాల మధ్య వివాదం ఏర్పడి ప్రత్యర్థి వర్గీయులకు కొమ్ముకాశారనే నెపంతో వివాదం ఏర్పడిందని స్థానికులు తెలిపారు. సాయంత్రం వేళలో మా పొలానికి వెళ్లి వస్తుండగా తిట్టారని, మా ఇంటి ముందు నుంచి వెళ్తున్న వారిని మమ్మల్ని ఎందుకు బూతులు తిట్టారని అడిగినందుకు ఇది మనసులో ఉంచుకొని సంక్రాంతి పండుగకు వచ్చిన మాపై, మా ఇంటి మీదకి వచ్చి ఒకేసారి దాడికి పాల్పడటం సరికాదని, చట్టం పై మాకు ఎంతో నమ్మకం ఉందని మా పై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జితేందర్ రెడ్డి, కుటుంబ సభ్యులు కోరారు.