Fight Better | తబితా ఆశ్రమంలో సంక్రాంతి సంబరాలు

Fight Better | తబితా ఆశ్రమంలో సంక్రాంతి సంబరాలు

  • నిరాశ్రయ పిల్లలకు పండుగ ఆనందం పంచిన మద్దెల దినేష్
  • ఆశ్రమ నిర్వాహకుడు వీరేంద్ర నాయక్‌కు ఘన సత్కారం

Fight Better | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : తబితా ఆశ్రమంలో నివసిస్తున్న పిల్లలు మంచి విద్యతో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి, దేశానికి సేవలందించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ ఆకాంక్షించారు. ఈ రోజు రామగుండం తబితా ఆశ్రమంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఆశ్రమ పిల్లలకు పతంగులు, సంక్రాంతి పండుగ ప్రత్యేక ఫలహారాలు అయిన సకినాలు, అర్షలు, కారంపూసలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పిల్లలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గత రెండు దశాబ్దాలుగా ఆశ్రమంలో నివసిస్తున్న నిరాశ్రయ పిల్లలను తన సొంత పిల్లలుగా భావిస్తూ, తల్లిదండ్రులు లేని లోటును తీర్చుతూ సేవలందిస్తున్న ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్‌ను మద్దెల దినేష్ శాలువాతో సత్కరించారు. ఆయన సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ప్రజా సంఘాల నాయకులు ఎం.ఎ. గౌస్, వై. లెనిన్, తొడుపునూరి రమేశ్ కుమార్ పాల్గొని, ఆశ్రమంలో ఉన్న పిల్లలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

Leave a Reply