ప్లాస్టిక్ తో పర్యావరణానికి పెనుముప్పు..
- ప్లాస్టిక్ రహిత ధర్మపురి లక్ష్యం
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
ధర్మపురి, ఆంధ్రప్రభ : ప్లాస్టిక్ తో పర్యావరణానికి పెనుముప్పని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్లాత్ బ్యాగులను, పర్యావరణ పరిరక్షణ క్యాప్ లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత ధర్మపురి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అధికారుల సైతం ప్రత్యేక చొరవ తీసుకొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
