90 Sarpanch | నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి

90 Sarpanch | నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి

  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

90 Sarpanch | లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ : రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు.

ఈ రోజు లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, మిట్టపల్లి, సూరారం గ్రామాలకు గుల్లకోట గ్రామపంచాయతీ, పోతపల్లి, అంకతిపల్లి, లక్ష్మీపూర్ గ్రామాలకు పోతపల్లి గ్రామపంచాయతీ, చందారం, హనుమంతుపల్లి, రంగపేట గ్రామాలకు చందారం గ్రామపంచాయతీలలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్(Returning) అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ.. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో 3 విడతల(3 instalments)లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటి విడతలో 90 సర్పంచ్, 816 వార్డు(90 Sarpanch, 816 Ward) సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామపంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలని, నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధి(100 Meter Range)లో గుంపులుగా ఎవరిని అనుమతించకూడదని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు, ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply