MLA | ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్‌గా….

MLA | ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్‌గా….
MLA | రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ టౌన్ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా కొలెపాక వజ్ర బిక్షపతి(Kolepaka Vajra Bikshapati)ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. గ్రామానికి చెందిన ముఖ్య కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో సమావేశమై అభ్యర్థిని ఖరారు చేశారు. ఆరోగ్య శాఖలో అవుట్ సోర్సింగ్(Outsourcing) ఉద్యోగిగా 25 సంవత్సరాలుగా సేవలందించిన విద్యావంతురాలైన వజ్ర అయితే ప్రజలకు ఉత్తమ సేవలు అందించగలుగుతుందని ఎంపిక చేశామని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తెలిపారు.
బ్యాలెట్ ద్వారా ఎన్నికై ప్రజలకోసం పని చేయాలని గత ఆరు నెలల క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేశానన్నారు. రేగొండ టౌన్(Raygonda Town)లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. తనను బీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(MLA Gandra Venkataramana Reddy)కి, రేగొండ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
