6 am to 5 pm | ఇసుకకొరత లేకుండాచూడండి…

6 am to 5 pm | ఇసుకకొరత లేకుండాచూడండి…

6 am to 5 pm | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా సకాలంలో ఇసుక తరలించే విధంగా చూడాలని ఊట్కూర్ తాసిల్దార్ చింతా రవి(Chinta Ravi) ఆదేశించారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లకు సరఫరా చేసే ట్రాక్టర్ యజమానులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు ఇండ్లు నిర్మించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్లకు నాగిరెడ్డిపల్లి పెద్దవాగు(Nagireddypally Peddavagu)కు కలెక్టర్ ఇసుక రీచ్ కేటాయించారని అన్నారు. ఇసుక రీచ్ వద్ద ఎస్ఆర్ఎ ఆలస్యంగా రావడం వల్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక సరఫరా చేయలేకపోతున్నామని పలువురు ట్రాక్టర్ యజమానులు(tractor owners) తాసిల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు స్పందించిన తాసిల్దార్ ఇసుక రీచ్ వద్ద ఉన్న ఎస్ ఆర్ ఏ సకాలంలో విధులకు రావాలనిఆదేశించారు.

ఇసుక రీచ్(Sand Reach) నుండి నారాయణపేట ధన్వాడ మండలాలకు ఇసుక తరలింపులో జప్యం జరుగుతుందని ఉదయం 6 గంటల నుండి సాయంత్రం5గంటల వరకు ఇసుక తరలించేందుకు అనుమతి ఇస్తానని తాసిల్దార్ హామీ ఇచ్చారు. ఊట్కూర్, నారాయణపేట ధన్వాడ మండలాల్లో ఇసుక రీచ్ కు కేటాయించిన గ్రామాలకు త్వరితగతిన ఇసుక పంపిణీ చేయాలనిఅన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్,మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యగ్నేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, నాగిరెడ్డిపల్లి నాయకులు గోవింద్ గౌడ్ , చెన్నప్ప, బస్వరాజ్ తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply