మీ బిడ్డగా మీ ముందుకు వచ్చాను..
మీ బిడ్డగా మీ ముందుకు వచ్చాను..
- నన్ను ఆశీర్వదించండి..కౌన్సిలర్ గా గెలిపించండి..
- ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తాను
- ఇండిపెండెంట్ అభ్యర్థిగా నీల యాదలక్ష్మి లింగం సార్
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు నుంచి ఇండిపెం డెంట్ అభ్యర్థిగా నీల యాదలక్ష్మి లింగం సార్ ఎన్నికలో పోటీ చేస్తున్నా రు. గత 40 సంవత్సరాలుగా ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం సేవ లందిస్తూ వార్డు ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా ఆయ నకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గురువారం అభ్యర్థి వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా కాలనీ వాసులను ఆప్యా యంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకొని కీలక హామీ లు ఇచ్చారు.
ఈ సందర్భంగా వార్డులోని ప్రధాన సమ స్యలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ముఖ్యంగా డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల సమస్య లను ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గట్టు రాజు ఇంటి దగ్గర నుంచి పాలకుర్తి రోడ్డు వరకు డ్రైనేజీ పనులు తప్పనిసరిగా చేప డతామని, అలాగే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మార్కెట్ కార్యాలయం వరకు మోరితో సహా డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంజనే యులు గుడి దగ్గర నుంచి గ్రంథాలయం వరకు డ్రైనేజీ పనులు, మాడ బోయిన రాజు, గోరంతల రామస్వామి ఇంటి వద్ద రోడ్డు నిర్మాణం చేప డతామని అన్నారు.
ఇండ్ల మధ్య ఉన్న స్తంభాన్ని తొలగించి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ పనులన్నీ పూర్తయిన వెంటనే తొలి ప్రాధాన్యతగా మినీ ట్యాంక్ నిర్మాణం చేపడతామని పేర్కొ న్నారు. ప్రజల ఆశీర్వాదంతో గెలిచి, మాటలకే పరిమితం కాకుండా అభివృద్ధిని చేసి చూపిస్తామని నీలా యాదలక్ష్మి లింగం సార్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి 5వ వార్డు జనరల్ మహిళ రిజర్వేషన్ కావడం తో తమ కుటుంబానికి అవకాశం దక్కిందన్నారు.
వార్డులో సుమారు 370 మెజారిటీ ఓట్లు ఉండటంతో విజయం సాధించే అవకాశం బలం గా ఉందన్నారు. ఆయన సతీమణి డిగ్రీ పూర్తి చేసి, 30సంవత్సరాల పాటు టీచర్‌గా సేవలందించిన అనుభవం ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ చివరి గంటలో ఇటీవల పార్టీలో చేరిన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ప్రజల మద్దతు తమ కే ఉందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
