44degrees | తెలంగాణ‌లో భానుడి భగ‌భ‌గ‌

44degrees | తెలంగాణ‌లో భానుడి భగ‌భ‌గ‌

44degrees | హైదరాబాద్‌లో 42°C ఉష్ణోగ్రతతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 44°C వరకు ఎండల ప్రభావం
రాబోయే రోజుల్లో మరింత వేడి.. వాతావరణ శాఖ హెచ్చరికలు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భానుడు సెగ‌లు క‌క్కుతున్నాడు. తెలంగాణ రాష్ర్టంలో ప‌లు ప్రాంతాలు నిప్పుల కొలిమిని త‌ల‌పిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా, మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40°C నుంచి 45°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రత సుమారు 42°C ఉష్ణోగ్ర‌త‌ నమోదైంది. దీంతో జ‌నాలు బ‌య‌ట తిర‌గానికి ఇబ్బందులు ప‌డ్డారు. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలు అయిన ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

44degrees
44degrees

ఎండ తీవ్రత కారణంగా రైతులు, కూలీలు తమ పనులు ఉదయం లేదా సాయంత్రం సమయంలోనే చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఎండలు కొనసాగవచ్చని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని, ఎండ‌దెబ్బ‌కు గురికాకుండా మంచినీరు ఎక్కువగా తాగాలని అధికారులు సూచిస్తున్నారు.

click here to read more

click here to read ‘ఆటోమొబైల్‌’కు.. అల్టిమేటం

Leave a Reply