32yrs | విద్యుదాఘాతంతో….

32yrs | విద్యుదాఘాతంతో….

32yrs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మిర్తివలస గ్రామంలో పెళ్లి వేడుకల మధ్య విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో పెళ్లి సందడి నెలకొన్న వేళ విద్యుదాఘాతానికి గురై వరుడి అన్న మృతిచెందడం కుటుంబ సభ్యులను కన్నీటి పర్యంతం చేసింది.

పొన్నాడ రమణ చిన్న కుమారుడు దిలీప్ కుమార్‌ పెళ్లి ఈరోజు జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా ఇంట్లో పెళ్లి పనులు, ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రెండో కుమారుడు సతీష్ (32) స్నానం చేసిన అనంతరం దుస్తులు ఆరబెట్టేందుకు ఇంటి మేడపైకి వెళ్లాడు.

ఈ క్రమంలో అనుకోకుండా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సతీష్‌కు ఏడాది క్రితమే వివాహం కాగా, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి ఇంట్లో ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారడంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

Leave a Reply