ఎండలో కూలీలకు ఊరటనిచ్చిన సర్పంచ్..

మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని పెద్ద చెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఈ రోజు సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ సందర్శించారు. మండుతున్న ఎండలో పనులు చేస్తున్న కూలీలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం స్వయంగా గడ్డపార పట్టి కొంతసేపు పనుల్లో పాల్గొని కూలీలను ఉత్సాహపరిచారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో కూలీలు అలసటకు గురికాకుండా చల్లని పానీయాలు పంపిణీ చేశారు. ఉదయం వేళల్లోనే పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు.సర్పంచ్ చూపిన చొరవపై కూలీలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ శ్యామల, ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.