20 overs lఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ సునామీ.. పంజాబ్ బౌలర్లకు చుక్కలే!
20 overs l ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ సునామీ.. పంజాబ్ బౌలర్లకు చుక్కలే!
20 overs l ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ పరుగుల విధ్వంసం సృష్టించింది. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న పోరులో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 235/4 భారీ స్కోరు సాధించింది. ఆరంభంలో ఓపెనర్లు హెడ్(38), అభిషేక్(35) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (55) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్(69) సిక్సర్ల వర్షం కురిపించగా, నితీష్ కుమార్ రెడ్డి (29*) ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, ఫెర్గుసన్, చాహల్, వైశాఖ్‌లకు తలో వికెట్ దక్కింది.
