2029 Lok Sabha | ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి…

2029 Lok Sabha | ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి…

2029 Lok Sabha | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తమిళనాడులో కొత్తగా ఏర్పడిన విజయ్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని, పార్టీ నేతలు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో మాట్లాడిన స్టాలిన్.. ప్రస్తుతం ఎదురైన ఓటమి తాత్కాలికమేనన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో డీఎంకే మళ్లీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నానని స్టాలిన్ తెలిపారు. ప్రజల అభిప్రాయాలను సేకరించి ఓటమి కారణాలను విశ్లేషించేందుకు 36 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తమిళనాడులో డీఎంకే గుర్తైన ‘సూర్యుడు’ ఎప్పటికీ అస్తమించడని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.