2025 Act | ఉపాధి పథకాన్ని ఎత్తివేసే కుట్ర

2025 Act | ఉపాధి పథకాన్ని ఎత్తివేసే కుట్ర

  • భోగి మంటల్లో నూతన ఉపాధి చట్టం జీవో ప్రతులు

2025 Act | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధ‌రించాలని, మోడీ తెచ్చిన 2025 చట్టాన్ని(2025 Act) రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ రోజు శ్రీకాకుళంలో తిలక్ నగర్‌లో గ్రామీణ ఉపాధి హామీ కొత్త చట్టం జీఓ కాపీలను భోగి మంటలో దగ్ధం చేశారు. ఉపాధి పథకాన్ని క్రమేపి ఎత్తివేసే దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చిందని వారు దుయ్యబట్టారు.

ఇటువంటి పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, వైసీపీ పార్టీలు ఆమోదించడం సిగ్గుచేటన్నారు. బి.క్రిష్ణ మూర్తి అధ్య‌క్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కె. నాగమణి, పి. తేజేశ్వరరావు, పి ప్రసాదరావు, కే శ్రీనివాస్ యం గోపి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply