15days | హైవే.. దిగ్బంధం..

15days | హైవే.. దిగ్బంధం..

గ్యాస్ కొరతపై భ‌గ్గుమ‌న్న వినియోగదారులు
అర్ధ‌రాత్రి నుంచే గోదాం వ‌ద్ద‌ ఎదురు చూపులు
బుకింగ్ చేసి పదిహేను రోజులు దాటినా ఇవ్వడం లేదని ఆగ్రహం
వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయింపు
ఖాళీ సిలిండ‌ర్ల‌తో ధ‌ర్నా
భారీగా స్తంభించిన వాహనాలు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఘటన

15days | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో వంట గ్యాస్ కొర‌త‌పై వినియోగ‌దారులు భ‌గ్గుమ‌న్నారు. బుకింగ్ చేసి ప‌దిహేను రోజులు దాటినా సిలిండ‌ర్ రాక‌పోవ‌డంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆదివారం గ్యాస్ లోడ్‌ లారీ వస్తుందని సమాచారం తెలుసుకున్న వినియోగదారులు అర్ధరాత్రి నుంచే తమ ఖాళీ సిలెండర్లతో గోదాం ముందర నిద్రించారు. తెల్లవారే వరకు లారీ రాకపోవడం, సంబంధించిన నిర్వాహకులు కూడా ఎవరూ లేక పోవడంతో.. సమాధానం చెప్పేవారు ఎవరూ లేరని వినియోగదారులు విసుగు చెంది ఆగ్రహంతో వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఖాళీ సిలిండర్లతో ధర్నా నిర్వహించారు.

 15days |
15days |

ఈ క్ర‌మంలో హైవేకు ఇరువైపులా భారీగా వాహ‌నాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై వెంకన్న, దంతాలపల్లి ఎస్ఐ రవి కుమార్ లు హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని వినియోగదారులను శాంతించాలని కోరారు. గ్యాస్ రాక నెలరోజులు అయిందని, బుక్ చేసి 15 రోజులైనా ఇవ్వడం లేదని, సిబ్బంది వచ్చి సమాధానం చెప్పేంత వరకు ఇక్కడ నుంచి కదలమని రోడ్డుపై బైఠాయించారు. ఎంతకూ కదలక పోవడంతో ఎస్ఐ వెంకన్న నిర్వాహకులను ఇక్కడికి రప్పిస్తామని హామీ ఇచ్చి ఆందోళ‌న‌కారుల‌ను బలవంతంగా పక్కకు తప్పించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాలను పంపించి వేశారు.

15days | కృత్రిమ కొరత స్పృష్టిస్తున్నారని ఆరోపణలు..

అందులో పనిచేసే సిబ్బంది ముందుగానే ఖాళీ సిలిండర్లను తీసుకువెళ్తున్నారని ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వెంటనే ఓటీపీలు చెప్పమని ఫోన్లు చేసి అడుగుతున్నారని తెలిపారు. అయినా బుక్ చేసిన వారికి ఇవ్వకుండా గ్యాస్ రాలేదంటూ ముందుగానే బ్లాకులో అమ్ముకొని కృత్రిమ కొరత స్పృష్టిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

15days | ఇండెంట్ పెట్టకపోవడంలో ఆంతర్యం..

పదిహేను రోజులైనా స్టాక్ ఇండెంట్ ఎందుకు పెట్టడం లేదంటూ.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా లేని కొరత నర్సింహులపేట మండలంలో ఎందుకు ఏర్పడుతుందని నిలదీస్తూ దీనిలో ఆంతర్యం ఏమిటీ అని ప్రశ్నిస్తున్నారు.

15days | కొరవడిన అధికారుల పర్యవేక్షణ ..

జిల్లాలోని సివిల్ సప్ల‌యీస్ అధికారులు తనిఖీలు ఎందుకు జరపడం లేద‌ని, ఇంత కృత్రిమ కొరత స్పృష్టిస్తున్నా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న యూరియా, నిన్న పెట్రోల్,ఇవ్వాల గ్యాస్ కష్టాలు తీరడం లేదని ప్రభుత్వ తీరుపై ప్రజలు మండిప‌డ్డారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్యాస్ కొర‌త‌ను నివారించాల‌ని వినియోగ‌దారులు కోరుతున్నారు.

CLICK HER TO READ MORE : 1stwicket | రెచ్చిపోతున్న ట్రావిస్ హెడ్‌

CLICK HER TO READ MORE

Leave a Reply