15days | ఇంధన సరఫరాపై ఆందోళనలు.. ప్రభుత్వ చేపడుతున్న చర్యలు

15days | ఇంధన సరఫరాపై ఆందోళనలు.. ప్రభుత్వ చేపడుతున్న చర్యలు
15days | యుద్ధ ఉద్రిక్తతలతో చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావం
హార్ముజ్ జలసంధి వద్ద సంక్షోభం
అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
దేశంలో ఎల్పీజీ నిల్వలు, సరఫరా పరిస్థితి
పెరుగుతున్న ముడి చమురు ధరలు
ప్రీమియం పెట్రోల్ ధరల పెరుగుదల సంకేతం
భవిష్యత్తులో ఇంధన సంక్షోభం అవకాశాలు
ఎగుమతుల పరిమితిపై కేంద్రం ఆలోచనలు
15days | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో యుద్ధం, ఉద్రిక్త పరిస్థితులు నానాటికీ ముదురుతున్న నేపథ్యంలో, అక్కడి ప్రభావం భారత్ పై పడుతున్నాయి. ముఖ్యంగా అక్కడి నుంచి దిగుమతి అయ్యే చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి.
ఇటీవల దేశవ్యాప్తంగా ఇంధన పరిస్థితులపై తరచుగా ఉన్నత స్థాయి సమీక్షలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చమురు, గ్యాస్, విద్యుత్ రంగాలపై సమీక్ష నిర్వహించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ఈ ప్రభావం భారత్ లోని అన్ని రాష్ట్రాలకూ చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుఇడు ఇంధన నిల్వలు, సరఫరాపై సమీక్షలు నిర్వహిస్తూ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 15 రోజుల పాటు సరిపడే ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని అధికారులు అంటున్నారు..
అయితే అసలు ఆందోళనకర పరిస్థితులు ప్రపంచ స్థాయిలో ఉన్నాయి. హార్ముజ్ జలసంధి వద్ద చెలరేగిన ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా మార్గాలు దెబ్బతినడం, అక్కడే చమురు సరఫరా చేసే ట్యాంకర్లు నిలిచిపోవడం వంటి పరిణామాల వల్ల ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతోంది.. భారత్‌కు అవసరమైన ఎల్పీజీ లో సుమారు 90% వరకు పశ్చిమాసియాపైనే ఆధార పడటం వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఇక ధరల విషయానికి వస్తే, సాధారణ వినియోగదారులకు ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెద్దగా మారలేదు. కానీ ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతూ తమపై పెరుగుతోన్న ఒత్తిడిని ఆయిల్ కంపెనీలు భరిస్తున్నాయని వ్యాపార, వాణిజ్య వర్గాల సమాచారం.
అదే సమయంలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే—ప్రీమియం పెట్రోల్ ధరలు మాత్రం పెరగడం ప్రారంభమైంది. ఇది భవిష్యత్తులో సాధారణ ఇంధన ధరలపైనా ప్రభావం చూపిస్తాయనడానికి సంకేతంగా చెప్పుకోవచ్చు.
రాను రాను గ్యాస్ సంక్షోభం అన్ని రంగాలపై మరింత స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో ఎల్పీజీ వినియోగం తగ్గిపోవడం, సరఫరాలో ఆలస్యం, ట్యాంకర్లు నిలిచిపోవడం ఇవన్నీ కలిపి ఒక పెద్ద హెచ్చరికగా మారాయి.
ఈ పరిస్థితుల్లో కేంద్రం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తోంది. దేశీయ అవసరాలను ముందుగా తీర్చేందుకు ఇంధన ఎగుమతులను పరిమితం చేసే అవకాశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.
