12వ వార్డులో గెలుపు దిశగా పూదరి లావణ్య సాగర్

12వ వార్డులో గెలుపు దిశగా పూదరి లావణ్య సాగర్

విస్తృతంగా ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
ఆశీర్వదించండి సేవకురాలిగా పనిచేస్తా

మంథని: 12 వ వార్డులో బిఆర్ పార్టీ గెలుపు దాదాపు ఖరారు అయినట్లే. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆ పార్టీ అభ్యర్థి లావణ్య సాగర్ తరఫున జోరుగా ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డని గెలిపించండి ఆయన తెలిపారు. మంథని మున్సిపల్ మున్సిపల్ పరిధిలోని 12 వార్డు బీఆర్ఎస్ పక్షాన పోటీ చేస్తున్న పూదరి లావణ్య సాగర్ వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లావణ్య సాగర్ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని తన పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ఆ వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆశీస్సులతో మున్సిపల్ బరిలో ఉన్నానని అవకాశం కల్పించాలని ఆయన కోరారు. మౌలిక వసతుల సౌకర్యం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండి, ప్రతి ఇంటి పెద్ద బిడ్డగా సేవ చేస్తానని ఆయన తెలిపారు.