10వ వార్డులో ప్రచారంలో జోరు పెంచిన కారు
10వ వార్డులో ప్రచారంలో జోరు పెంచిన కారు
రైటప్: ఓటరు మద్దతు కోరుతున్న బిఆర్ఎస్ అభ్యర్థి జుట్ల సంగీత సాగర్
మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 10వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం జోరు పెంచారు. వార్డు పరిధిలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. గడపగడపకు వెళ్లి తనను ఆదరించాలని 20వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి జుట్ల సంగీత సాగర్ కోరుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేస్తున్నాను గెలిచాక ఏ ఏ పనులు చేపడుతాను అనే అంశాలను ఓటర్లకు వివరిస్తూ మద్దతు కోరుతున్నారు. గతంలో బిఆర్ఎస్ పాలనలో నాటి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సహకారంతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు .కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినప్పటికీ మక్తల్ లో ఎలాంటి అభివృద్ధి చేయడం లేదన్నారు .
కాంగ్రెస్ ప్రభుత్వంలో మాటలే తప్ప చేతలు ఉండవన్నారు. రెండేళ్లు దాటిన అభివృద్ధిలో అడుగు దాటని మక్తల్ పట్టణం ఇకముందు అభివృద్ధి జరుగుతుందంటే ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నిస్తున్నారు .కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు పెంచుకోవడమే తప్ప అభివృద్ధి వారికి పట్టదని అన్నారు .అభివృద్ధి కోసం ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ నుండి పదవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న జుట్ల సంగీత సాగర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో 10వ వార్డ్ ఇంచార్జి సూతరి రవి కుమార్,జుట్ల సాగర్,కర్రెమ్ స్వామి,గణేష్,బాలు,హరీష్, వెంకటేష్,అనిల్,జాను,దామోదర్ ,నాని,జనార్దన్,పవన్,మహేష్,సూర్య నారాయణ,టిల్లు,రాము, ఠాగూర్, మారుతి,అనిల్,అరుణ్,రాహుల్,గణేష్,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
