1064call | లంచం తీసుకుంటూ….
1064call | లంచం తీసుకుంటూ….
1064call | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని బోధన్ లో అవినీతి ఘటన వెలుగుచూసింది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని లంచం తీసుకుంటున్న పోలీస్ అధికారి ఏసీబీకి చిక్కాడు.
బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న భాస్కరాచారి, ఒక వ్యక్తి నుంచి రూ.7 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ ) రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సివిల్ వివాదం పరిష్కారం పేరుతో డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని లేదా 9440446106 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.
