అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి…

అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి…

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో మన్యవీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు Alluri Sitarama Raju 102వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.

డిఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన పోరాటం, త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఓ సక్సేన, జిల్లా పర్యాటక, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా పర్యాటక మేనేజర్ ప్రతాప్ రెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.