ఆర్మీ జవాన్ రవిచంద్ర రెడ్డికి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ నివాళి
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ జవాన్ రవిచంద్ర రెడ్డి శ్రీనగర్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందడంతో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఉషశ్రీ చరణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ రక్షణ కోసం మూడు దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించిన రవిచంద్ర రెడ్డి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన మృతి కుటుంబానికే కాకుండా గ్రామానికి, జిల్లాకు తీరని లోటని అన్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రవిచంద్ర రెడ్డికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
