తుంగభద్ర డ్యామ్‌పై మంత్రి పయ్యావులతో ఛైర్మన్ భేటీ
తుంగభద్ర డ్యామ్‌పై మంత్రి పయ్యావులతో ఛైర్మన్ భేటీ
మరమ్మతులు, కొత్త గేట్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ చొరవకు కృతజ్ఞతలు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను తుంగభద్ర డ్యామ్ ఛైర్మన్ ఎస్.ఎన్. పాండే మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం మంత్రి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా తుంగభద్ర డ్యామ్ మరమ్మతులు, కొత్త గేట్ల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన చొరవపై డ్యామ్ ఛైర్మన్ ఎస్.ఎన్. పాండే కృతజ్ఞతలు తెలిపారు. డ్యామ్ భద్రత, ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు.
తుంగభద్ర డ్యామ్‌కు సంబంధించి చేపట్టాల్సిన మరమ్మతులు, భద్రతాపరమైన అంశాలు, ఆధునికీకరణ పనులపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం వల్ల డ్యామ్ నిర్వహణ, భద్రతా చర్యలు మరింత బలోపేతం అవుతాయని ఛైర్మన్ పేర్కొన్నారు.
