MLA | ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడి
MLA | ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడి
హుజురాబాద్ ఎమ్మెల్యే వాహనం ధ్వంసం
MLA | కరీంనగర్, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు రెచ్చిపోయి అరాచకం సృష్టించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం పై దాడికి తెగబడ్డారు. క్యాంపు కార్యాలయంలో ఉన్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు.
పి ఎం జె జ్యువెలర్స్ చోరీ ఘటనపై బీజేపీ టిఆర్ఎస్ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న సమయంలో బీజేపీ నాయకులు రెచ్చిపోయి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కర్రలతో వచ్చి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు.

