ప్రశంస అవార్డు అందుకున్న సర్పంచ్ సింధు నగేష్

జైనూర్, ఆంధ్రప్రభ : హైదరాబాదులోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం జరిగిన వెటా ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వేట ఇండియా గ్రాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని భూసి మెట్ట పంచాయతీ సర్పంచ్ సింధు నగేష్లకు ఆహ్వానించారని వారు శుక్రవారం తెలిపారు.

ఈ కార్యక్రమంలో వేట ఇండియా ఉమెన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ ద్వారా చేపట్టే కార్యక్రమాల గురించి మహిళల సాధికారత గురించి చైర్మన్ తో పాటు హాజరైన మంత్రి ఎమ్మెల్యేలు వివరించాలని సర్పంచ్ తెలిపారు. ఈ పరంభోత్సవ కార్యక్రమానికి తన ఆహ్వానించి ప్రశంసా పత్రాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందని సర్పంచ్ సింధు నగేష్ పేర్కొన్నారు.