ఊట్కూర్‌లో స్వాతంత్య్ర వేడుకలు

  • వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
  • పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ
  • దేశభక్తి కార్యక్రమాలతో ఆకట్టుకున్న విద్యార్థులు

ఊట్కూర్‌, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలల విద్యార్థులు వివిధ వేషధారణలతో నిర్వహించిన ప్రభాత్‌ భేరి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మండలంలోని పలు ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.

ముందుగా ఊట్కూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై రమేష్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి శంకర్‌నాయక్‌, ఏవో కార్యాలయంలో ఏవో గణేష్‌రెడ్డి, పశువైద్యశాలలో డాక్టర్‌ యమున, ఊట్కూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ రేణుక భరత్‌, సింగిల్‌ విండో కార్యాలయంలో చైర్మన్‌ బాల్‌రెడ్డి, ఎంఆర్‌సీ కార్యాలయంలో ఎంఈఓ మాధవి జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

ఊట్కూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌ సంతోషి, మండల మహిళా సమైక్య కార్యాలయంలో అధ్యక్షురాలు శివలీల, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, లయన్స్‌ క్లబ్‌ కార్యాలయంలో అధ్యక్షులు, ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ టీచర్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ వైస్‌ చైర్మన్‌ నింగిరెడ్డి, ఎంపీడీవో పావని, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ భాస్కర్‌, మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు ఎల్కోటి నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ మాజీ మండల అధ్యక్షుడు యజ్ఞేశ్వర్‌రెడ్డి, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రమేష్‌, మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోరం మహేష్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.