స్వచ్చంద సేవకు దక్కిన గౌరవం..
పంద్రాగస్టు వేడుకల్లో ఉత్తమ సేవకులుగా అవార్డు స్వీకరించిన డాక్టర్ వేములపల్లి సురేష్, రోజా దంపతులు
చల్లపల్లి, ఆంధ్రప్రభ : విద్యా, వైద్య, స్వయం ఉపాధి రంగాల్లో విస్తృత రీతిలో సేవలందిస్తూ…. ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ అండగా నిలుస్తున్న పురిటిగడ్డ ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ వేములపల్లి సురేష్, రోజా దంపతులకు సముచితమైన గౌరవం దక్కింది. పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ సమాజ సేవకులుగా సురేష్, రోజా దంపతులు అవార్డు స్వీకరించారు.
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఇంచార్జ్ కలెక్టర్ పి.నవీన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడులు ప్రశంశ పత్రం అందజేసి సురేష్, రోజా దంపతులను అభినందించారు. ఉత్తమ సేవకులకు సేవా అవార్డు లభించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
