Trump | ట్రంప్ దృష్టిలో వాట్ ఈజ్ భార‌త్‌?

ట్రంప్ దృష్టిలో వాట్ ఈజ్ భార‌త్‌?

  • మూడో ప్ర‌పంచ దేశాల‌పై అమెరికా వేటు!
  • ప్ర‌స్తుతం భార‌త్ స్థానం ఏదీ?
  • రివ‌ర్స్ మైగ్రేషిన్‌లో ఇండియా ఉంటుందా?

Trump | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌పంచానే శాసించాల‌ని చూస్తున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (trump) అవ‌కాశం దొరికిన‌ప్పుడు విదేశీయుల‌పై త‌న అస్ర్తం వినియోగిస్తున్నారు. వైట్‌ హౌస్‌ సమీపంలో ఇద్దరు నేషనల్‌ గార్డు సిబ్బందిపై ఓ అఫ్ఘాన్‌ జాతీయుడు కాల్పులు జరిపిన సంగ‌తి విదిత‌మే. ఈ క్ర‌మంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడో ప్ర‌పంచ దేశాల నుంచి వ‌ల‌స‌లు బంద్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే అమెరికా దృష్టిలో భార‌త్ (india)కు ఏ స్థానం ఉంద‌నేది చ‌ర్చ జ‌రుగుతుంది. ఉపాధి, విద్య కోసం అమెరికాకు వెళుతున్న విదేశీయుల‌పై ఈ ప్ర‌భావం ప‌డుతుంది. అమెరికా ఏ నిర్ణ‌యం తీసుకున్నా భార‌త్‌కు ఎంత న‌ష్టం క‌లుగుతుందో అనేది విద్యావంతులు చ‌ర్చించుకుంటున్నారు. రివ‌ర్స్ మైగ్రేషిన్‌లో ఇండియా ఉంటుందా? అనేది చ‌ర్చ జ‌రుగుతుంది.

ఇదీ అమెరికా అధ్య‌క్షుడు తీసుకున్న నిర్ణ‌యం!
అమెరికా (america) వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు మూడవ ప్రపంచ దేశాలు అన్నింటి నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తానని అమెరికా అధ్య‌క్షుడు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ హయాంలో చట్టవ్యతిరేకంగా దేశంలోకి జరిగిన కోట్లాది మంది ప్రవేశాలను రద్దు చేస్తానని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌యోజ‌నాల నిలిపివేత‌!
అమెరికా దేశ పౌరసత్వం లేని వారికి లభిస్తున్నఆ ప్ర‌భుత్వం ఇస్తున్న ప్రయోజనాలు, సబ్సిడీలను నిలిపివేస్తామని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. దేశంలో ప్రశాంతతకు భంగం కలిగించే వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించబోమని, నేరాభియోగాలు, భద్రతాపరమైన ముప్పు, పాశ్చాత్య నాగరికతకు అనుగుణంగా వ్యవహరించని విదేశీ జాతీయులను వారి దేశాలకు పంపించివేస్తామని హెచ్చరించారు. రివర్స్‌ మైగ్రేషన్‌ ఒక్కటే ఈ పరిస్థితిని చక్కదిద్దగలదని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల జనాభా 5.30 కోట్లు ఉందని, వీరిలో అత్యధికులు విఫల దేశాలు లేదా జైళ్లు, మానసిక చికిత్సాలయాలు, నేర గ్యాంగులు, డ్రగ్స్‌ ముఠాలకు చెందిన వారని గుర్తించిన‌ట్లు తెలిపారు. వీరు, వీరి పిల్లలు దేశభక్తులైన అమెరికన్‌ పౌరులు చెల్లించే పన్నులతో బతుకుతున్నారని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

అమెరికా దృష్టిలో ఇవీ మూడో ప్ర‌పంచ దేశాలు
ట్రంప్ అధ్య‌క్షుడుగా అయిన తొలి రోజుల్లో 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ జాబితాలో అఫ్గానిస్థాన్ ఇన్ యెమెన్, మయన్మార్ నాధ్, కాంగో ఉన్వెటోరియల్ గినియా ఎరిట్రియా, హైలీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలు ఉన్నాయి. దీంతో తాజా ప్రకటన కూడా ఈ దేశాలను ఉద్దేశించేనా అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. అయితే ట్రంప్ ప్ర‌క‌ట‌న‌ల‌కు అర్థ‌లు కూడా వేరు అని ఒక చ‌ర్చ కూడా లేక‌పోలేదు. అసలు ఆయన ఏ ప్రతిపాదికన ఇచ్చి ఉంటారో అర్థం కాక యూఎస్ సాయం మీద ఆధారపడిన పేద దేశాలు ఆందోళన చెందుతున్నాయి. చారిత్రకంగా మొదటి ప్రపంచ దేశాలంటే అమెరికాతో సత్సంబంధాలు గల ప్రజాస్వామిక, పారిశ్రామికీకరణ చెందిన దేశాలు. ప్రధానంగా అమెరికా, దాని నాటో మిత్రులైన పశ్చిమ యూరోపియన్‌ దేశాలు, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలు. ఇక రెండవ ప్రపంచ దేశాలంటే కార్మికులు, రైతుల పాలనలో ఉండే కమ్యూనిస్టు-సోషలిస్టు దేశాలు. ఈ రెండు కూటములకు చెందని దేశాలను మూడవ ప్రపంచ దేశాలుగా వ్యవహరిస్తారు. మూడవ ప్రపంచ దేశాలలో ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికావ్యాప్తంగా ప్రధానంగా అభివృద్ధి చెందని దేశాలు. ఆర్థికంగా అభివృద్ధి చెందని దేశాలకు ప్రస్తుతం మూడవ ప్రపంచ దేశాలు అన్న పదం వర్తిస్తోంది. మూడవ ప్రపంచ దేశాలంటే ఏవి అని ట్రంప్‌ వివరించనప్పటికీ ఆయన దృష్టిలో భారత్‌ ఏ క్యాటగిరీలో ఉందో ఎవరూ ఊహించలేరు.

ఇదీ భార‌త్ ప‌రిస్థితి
ఒక‌ప్పుడు వ‌ర్ధ‌మాన దేశాల జాబితాలో భార‌త్ దేశం ఉంది. చారిత్రకంగా చూస్తే భారత్‌ మూడవ ప్రపంచ దేశాల జాబితాలోకి వస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో వర్గీకరిస్తే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న‌దేశాల జాబితాలోకి చేరింది. జపాన్‌ ఆర్థిక వ్యవస్థను కూడా భారత్‌ ఇటీవలే అధిగమించింది. అయితే అమెరికా దృష్టిలో భార‌త్ ప‌రిస్థితి ఏమిటి అన్న‌ది ప్ర‌స్తుత ప్ర‌శ్న‌. ఏదీ ఏమైనా అమెరికా దేశాలు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా భార‌త్ ఎక్క‌డా త‌లొగ్గ‌డం లేదు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో భార‌త్ మేథావులు, నిపుణులు అమెరికా అలాంటి దేశాలకు కూడా అవ‌స‌రం ఉంటుంద‌న్న‌ది కూడా చ‌ర్చ సాగుతోంది! రివ‌ర్స్ మైగ్రేషిన్‌లో ఇండియా ఉండ‌క‌పోవ‌చ్చున‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. అమెరికా అధ్య‌క్షుడు స్ప‌ష్టత ఇచ్చే వ‌ర‌కూ వేచి చూడాల్సి ఉంటుంది.

Leave a Reply