టీజీ ఈఏపీసెట్ ఫలితాల్లో చిల్లంచర్ల విద్యార్థికి 113వ ర్యాంక్

టీజీ ఈఏపీసెట్ ఫలితాల్లో చిల్లంచర్ల విద్యార్థికి 113వ ర్యాంక్

మరిపెడ, ఆంధ్రప్రభ: టీజీ ఈఏపీసెట్-2026 ఫలితాల్లో మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన నూక సిద్ధు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 113వ ర్యాంక్ సాధించాడు. చిల్లంచర్ల గ్రామానికి చెందిన నూక అశోక్, సుమతిల కుమారుడైన సిద్ధు తన ప్రాథమిక విద్యను 6 నుండి 10వ తరగతి వరకు తెలంగాణ గురుకుల పాఠశాలలో పూర్తి చేశాడు. అనంతరం హన్మకొండలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించాడు. చిన్నతనం నుండి చదువులో ఎంతో చురుగ్గా ఉంటూ, క్రమశిక్షణ, పట్టుదలతో శ్రమించి నేడు రాష్ట్రస్థాయిలో ఇంజనీరింగ్ విభాగంలో అత్యుత్తమ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.

సిద్ధు సాధించిన ఈ ఘనత పట్ల ఆయన తల్లిదండ్రులు, చిల్లంచర్ల గ్రామస్తులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిద్ధును మరిపెడ మాజీ వైస్ ఎంపీపీ గాదె అశోక్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో సిద్ధు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని పలువురు గ్రామ పెద్దలు ఆకాంక్షించారు. ఈ అభినందన కార్యక్రమంలో సాదు సుధాకర్ రెడ్డి, గాదె వెంకట్ రెడ్డి, పిట్టల ధనుంజయ్, దూడపాక వెంకన్న, వెంకట్రాములు, శేఖర్, విద్యార్థి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply