మృతుని కుటుంబానికి రజక సంఘం ఆర్థిక సాయం

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఏటూరు గ్రామానికి చెందిన శ్రీరాముల మల్లయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని కన్నాయిగూడెం మండల రజక సంఘం నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం రూ.7,100 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పైడకుల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీరాముల సందీప్, గుర్రేవుల గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీరాముల నరేష్, ముక్కెర సాయి, శ్రీరాముల అశోక్, వేములవాడ శ్రీనివాస్, ఎలిశాల మహేందర్, శ్రీరాం రాజుతో పాటు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.