ఓటరు ఎన్యూమరేషన్‌ ఫారాలు నేటిలోగా సమర్పించాలి

ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

విజయవాడ, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమంలో భాగంగా బీఎల్‌వోలు పంపిణీ చేసిన ఓటరు ఎన్యూమరేషన్‌ ఫారాలను మంగళవారం సాయంత్రంలోగా బీఎల్‌వోలు లేదా హెల్ప్‌డెస్క్‌లకు అందజేయాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కోరారు.

సోమవారం 8వ డివిజన్‌లో ‘సర్‌’ కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన, తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే 80 శాతానికి పైగా ప్రక్రియ పూర్తైందని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ప్రతి ఓటరు ఎన్యూమరేషన్‌ ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.