Virushka | బృందావన్‌ను సందర్శించిన కోహ్లీ దంపతులు

విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. సోమవారం టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ ప్రకటనతో అతని 14 ఏళ్ల టెస్ట్ కెరీర్ ముగిసింది.

కాగా, టెస్ట్ క్రికెట్ నుంచి కోహ్లీ రిటైర్ అయిన మరుసటి రోజే విరాట్ తన భార్య అనుష్క శర్మతో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాడు. ఈ జంట ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ధామ్‌లో ఉన్న ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించి. అక్కడ వీరిద్ద‌రూ ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడ తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు వాటిని ఎంతో ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు.

ఇకపోతే, భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కోహ్లీ పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. ఇక నుంచి విరాట్ కేవ‌లం వన్డే క్రికెట్ కే పరిమితం అవుతాడు.

Leave a Reply