విజయ్ దేవరకొండ వివాదం – గిరిజనులపై వ్యాఖ్యలతో కేసు నమోదు

హైదరాబాద్‌: యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. తమిళ స్టార్ సూర్య నటించిన “రెట్రో” సినిమా విడుదలై 50 రోజులు దాటినప్పటికీ, ఆ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అతనికి చిక్కులు తెచ్చిపెట్టాయి.

ఆ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు గిరిజనులను అవమానించేలా ఉన్నాయని ఆరోపించిన గిరిజన సంఘం నాయకుడు అశోక్ కుమార్, మాదాపూర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హీరోపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

దీనిపై స్పందించిన మాదాపూర్ ఏసిపి శ్రీధర్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం పోలీసు అధికారులు పూర్తి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. సెలబ్రిటీలు వేదికలపై చేసే వ్యాఖ్యల్లో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply