sharwa-Sesh | ప్రయత్నం ఫలించేనా..?

sharwa-Sesh | ప్రయత్నం ఫలించేనా..?
sharwa-Sesh | ధురంధర్ 2 ప్రభావం – ప్రేక్షకుల మూడ్ మారిందా?
పెట్రోల్ కొరతతో థియేటర్లపై ప్రభావం
బైకర్ సినిమాపై అంచనాలు
డెకాయిట్కు ఎదురైన సవాళ్లు
sharwa-Sesh | ఆంధప్రప్రభ వెబ్ డెస్క్ : శర్వానంద్.. నారీ నారీ నడుమ మురారి సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు బైకర్ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాని ఏప్రిల్ 3న రిలీజ్ చేయనున్నారు. అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ డెకాయిట్. శేష్ సినిమా వచ్చి చాన్నాళ్లు అయ్యింది. అందుచేత ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని తపిస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే.. ఈ ఇద్దరికీ ఇప్పుడు ఒకటే సమస్య ఏర్పడింది. దీంతో ఈ ఇద్దరిలో ఏ సినిమా మెప్పిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. శర్వా, శేష్.. ఈ ఇద్దరికీ సమస్య ఏంటి..?
sharwa-Sesh | ఓ వైపు ధురంధర్ 2..

శర్వా నటించిన బైకర్ మూవీలో యాంగ్రీమేన్ రాజశేఖర్ కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. యు.వీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా ఈవెంట్స్ లో రాజశేఖర్ కనిపిస్తున్నారు. బాగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే.. జనాల మూడ్ ఇప్పుడు వేరేలా ఉంది. ఓ వైపు బాలీవుడ్ మూవీ ధురంధర్ 2 ప్రభంజనం సృష్టిస్తుంటే.. మరో వైపు యుద్ద ప్రభావంతో గ్యాస్, పెట్రోల్ టెన్షన్ లో ఉన్నారు జనాలు. అందుచేత ఇప్పుడు సినిమా చూసే మూడ్ జనాలకు ఉందా.. థియేటర్ కి జనాలు వస్తారా అనే అనుమానాలు వస్తున్నాయి సినీ జనాల్లో.
sharwa-Sesh | సినిమాకి పెట్రోల్ కష్టాలు..

పెట్రోల్ కొరత ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో జనాలు పెట్రోల్ బంకుల వైపు పరుగులు పెడుతున్నారు. కిలో మీటర్ల క్యూలు హైదరాబాద్ నగరాల్లో కనిపిస్తున్నాయి. ఇవి పట్టణాలు, గ్రామాలకు కూడా విస్తరిస్తాయి అనడంలో డేటే లేదు. ఏప్రిల్ 10 న రానున్న అడివి శేష్ డెకాయిట్ మూవీకి కూడా ఇదే సమస్య. ఎంతలా ప్రచారం చేసినా.. సినిమా బాగుందని టాక్ వచ్చినా.. జనాలు పెట్రోల్ లేక థియేటర్లకి వెళ్లడం కంటే… ఓటీటీలో చూద్దాం అనుకోవచ్చు. అందుచేత శర్వా, శేష్ ఇద్దరికీ ఇదే సమస్య. మరి.. ఈ సమస్యను తట్టుకుని బైకర్, డెకాయిట్ ఎంత వరుకు ఆకట్టుకుంటాయో.. ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో అనేది ఆసక్తిగా మారింది.
