నేటి సాయంత్రం పయనం
నేటి సాయంత్రం పయనం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సీఎం రేవంత్‌రెడ్డి నేటి సాయంత్రం కేరళకు బయల్దేరి వెళ్లనున్నారు. తిరువనంతపురంలో రేపు జరిగే కేరళ నూతన సీఎం వి.డి. సతీషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క రాష్ర్ట నాయకులు హాజరుకానున్నారు. సతీశన్ ప్రమాణస్వీకారానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సతీశన్‌తో పాటు మంత్రులుగా 20 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ (UDF) ఘన విజయం సాధించిన అనంతరం, కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు ఆయన పేరును ఖరారు చేసింది. గత పాతికేళ్లుగా పారవూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వి.డి. సతీషన్.. 2021 నుంచి కేరళ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.
