శ్రీరాంపూర్ ఎస్ఆర్పి-3 గనిలో ప్రమాదం..
ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు
ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలునస్పూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి-3 సింగరేణి బొగ్గు గనిలో గురువారం ఉదయం షిఫ్టులో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కార్మికులు మహేందర్, సంపత్, రవి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన మహేందర్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు.ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఎఐటియుసి కార్మిక నాయకులు బాజీ సైదా, వీరభద్రి, ముష్క సమ్మయ్య ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.
