Village | ప్రజలారా.. మాయ మాటలు చెప్పే వాళ్లను నమ్మొద్దు…

Village | ప్రజలారా.. మాయ మాటలు చెప్పే వాళ్లను నమ్మొద్దు…
-సర్పంచ్ గా ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధి చేస్తా…
Village | టేకుమట్ల, ఆంధ్రప్రభ : గ్రామంలో ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటూ గ్రామంలో ప్రజాసేవ చేయడానికి నాకు అవకాశం కల్పించాలని వెంకట్రావు పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి అనవేణ సృజన రమేష్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఆలోచనతో ఉన్న వారికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారు.
గ్రామాభివృద్ధి(Village development) ఉద్దేశంతో ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే అన్ని రంగాల్లో ముందుండి మీ సమస్యలే నా సమస్యలుగా భావించి నిరంతరం ప్రజాసేవ కొరకు కృషి చేస్తానన్నారు. అన్ని రంగాల వర్గాల వారికి అనుకూలంగా సేవలందిస్తానని కుల మత జాతి విభేదాలు(ethnic differences) లేకుండా అందరిని సమాన దృక్పథంతో ప్రతి ఒక్కరిని ఆత్మగౌరవంతో సమాజ సేవకు ముందుకు వచ్చను మీరందరూ పెద్ద మనసు చేసుకొని సర్పంచ్ గా గెలిపిస్తే అనేక అభివృద్ధి పనులు చేయిస్తానన్నారు.
రాజకీయం(politics)గా, ఆర్థికంగా, సమాజ సేవకు ముందుండి సేవ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిస్వార్థ రాజకీయాలకు తావు లేకుండా నిస్వార్ధమైన సేవలను అందించడంలో ముందు ఉంటానని, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని గ్రామస్తులను కోరారు. అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
