అమరుల తాగ్యాల వల్లే తెలంగాణ సాధ్యం..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామంలో మంగళవారం స్థానిక సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, అమరుల తాగేలా వల్లే తెలంగాణ సాధ్యమైంది అన్నారు. తెలంగాణలో నిరంతర పాలన కృషి వల్లే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కొనియాడారు.

గ్రామ పంచాయతీ లో పనిచేసే సఫాయి కార్మికులకు సబ్బులు, నూనెలు చేతి గ్లౌజులను సర్పంచ్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కంతం సంతోష్, షఫీ బాలరాజ్ కొమర భూమేష్, బాబురావు, రామచంద్ర గౌడ్, అభిలాష్, కాంగ్రెస్ నాయకులు పల్లె శేఖర్, చాకలి గంగాధర్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, పల్లికొండ నరేందర్, మెడికల్ సత్యం, వీడీసీ అధ్యక్షులు గంగాధర్, క్యాషియర్ రాజేందర్ గౌడ్, కార్యదర్శి ప్రశాంత్, మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply