భీమ్‌గల్‌లో నేడు ఊర పండుగ ముడుపు కార్యక్రమం..

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ పట్టణంలో ఈ నెల 12న నిర్వహించనున్న సాంప్రదాయ ఊర పండుగను పురస్కరించుకుని ఆదివారం (జూలై 5) ముడుపు వేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు పతాని కృష్ణ, కమిటీ సభ్యులు తెలిపారు. స్థానిక బొదిరే గల్లీలోని మైసమ్మ ఆలయంలో సాయంత్రం 4 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. పట్టణంలో ఊర పండుగ ఏర్పాట్లలో భాగంగా ఈ ముడుపు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భీమ్‌గల్ పట్టణ ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఊర పండుగను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.