కమలాపూర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కమలాపూర్ (ఆంధ్రప్రభ): కమలాపూర్ మండల వ్యాప్తంగా శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఊరూరా, వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఉదయం తహశీల్దార్ సురేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ అధికారి గుండె బాబు, పోలీస్ స్టేషన్‌లో సీఐ నవీన్ యాదవ్, మార్కెట్ యార్డులో చైర్మన్ తవుటం ఝాన్సీ జెండాలను ఎగురవేశారు. మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, కుల సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణలు జరిగాయి. అనంతరం విద్యార్థులకు సీట్లు, పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు.